గ్యాస్ సిలిండర్ పేలి భవనం కూలి నలుగురు దుర్మరణం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఫతేపూర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలి రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మూడేళ్ల బాలుడితో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు సైతం ధ్వంసమయ్యాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.