వందేమాతర గీతాలాపనపై సుప్రీంకోర్టు విచారణ
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
జాతీయ గీతం లేదా గేయం ఆలపించకపోవడాన్ని శిక్షాభరితమైన నేరంగా మార్చవచ్చా అనే అంశంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రఖ్యాత గాయకుడు టి.ఎం. కృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, వందేమాతరం ఆరు చరణాల ఆలపించడంపై స్పందించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, గేయాన్ని రెండు లేదా ఆరు చరణాలకు పరిమితం చేయాలనే అంశాన్ని ప్రస్తుతం పరిశీలించలేమని స్పష్టం చేసింది.