ఏపీకి కేంద్ర బృందం: తుఫాన్ మరియు కరువు నష్టం పరిశీలన
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ మరియు కరువు పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు శనివారం కేంద్ర బృందాలు రానున్నాయని అధికారులు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి కోనసీమ, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నాయి. అలాగే శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కరువు పరిస్థితులను అంచనా వేయనున్నాయి. ఈ పర్యటన ముగిసిన తర్వాత కేంద్రానికి నివేదిక అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.