నేలకొండపల్లిలో వైభవంగా వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
నేలకొండపల్లి మండల పరిధిలో 132 వినాయక విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు తహశీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బుధ, గురువారాల్లో నిమజ్జనాలు సాగుతాయని, పంచాయతీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకునికి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ మహేశ్తో పాల్గొని పూజలు నిర్వహించారు.