యువ బాస్కెట్బాల్ క్రీడాకారులకు అనుభవమే గురువంటూ ఎన్బీఏ ఇండియా హెడ్ సన్నీ మాలిక్ వెల్లడి
రిపోర్టర్: విజయ్
స్థలం: ఢిల్లీ
దేశీయ పాఠశాల స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నమెంట్ల ద్వారా తమ లోపాలను సరిదిద్దుకోవాలని ఎన్బీఏ ఇండియా కంట్రీ హెడ్ సన్నీ మాలిక్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఏసీజీ జూనియర్ ఎన్బీఏ త్రీ ఆన్ త్రీ నేషనల్ టోర్నమెంట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై ఆటగాళ్ల స్టామినా, ఎండ్యూరెన్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలు విద్యార్థులకు సరికొత్త వ్యూహాలను నేర్పుతాయని మాలిక్ వెల్లడించారు.