యూవతను ఆకర్షించేలా శిరోమణి అకాలీదళ్ ప్రత్యేక కార్యక్రమం: సుఖ్బీర్ సింగ్ బాదల్ పిలుపు
రిపోర్టర్: శివ
స్థలం: పాటియాల
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాటియాలలో జరిగిన వైబ్ పంజాబ్ ది కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించిన ఆయన రాష్ట్ర భవితవ్యంపై మాట్లాడారు. అభివృద్ధి కోసమే ఓటు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన సుఖ్బీర్ సింగ్ బాదల్ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు.