కోల్కతాలో ఈడీ సోదాలు: భారీ ఆర్థిక మోసం కేసులో ఎనిమిది చోట్ల తనిఖీలు
రిపోర్టర్: విజయ్
స్థలం: కోల్కతా
కోల్కతాలో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎనిమిది ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. అధిక లాభాల ఆశ చూపి చిట్ ఫండ్ పేరుతో నిధులు సేకరించి, రియల్ ఎస్టేట్ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అమృత్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ఈ కేసులో గతంలోనూ దాడులు జరిగాయని, ఇప్పటివరకు రూ.75 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.