అద్భుత ప్రతిభ: మూడు నెలల్లోనే ఇరవై ఒకటి రికార్డులు సృష్టించిన చిన్నారి
రిపోర్టర్: రాజేష్
స్థలం: సేలం
తమిళనాడు లోని సేలంకు చెందిన చిన్నారి అబ్యాంక్ కన్నా కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇరవై ఒకటి జాతీయ మరియు అంతర్జాతీయ రికార్డులను సాధించినట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. సైన్స్ భావనలు, కఠినమైన గణిత సమస్యలు పరిష్కరించడంతో పాటు పది కిలోమీటర్ల పరుగు పందెం పూర్తి చేసి ఈ అరుదైన ఘనత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.