బొర్రంపాలెం గ్రామంలో శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి
రిపోర్టర్: సునీల్
స్థలం: ఏలూరు
భక్తిశ్రద్ధలతో శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి మరియు నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిభావాన్ని చాటుకున్నారు.