అర్నబ్ తుపాను ముప్పు: ప్రాణ రక్షణకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశం

రిపోర్టర్: సతీష్ స్థలం: కాకినాడ

అర్నబ్ తుపాను విపత్తు సమయంలో ప్రజల ప్రాణ రక్షణకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. తీర ప్రాంత గ్రామాల్లో చేపట్టిన ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, సహాయక బృందాల సంసిద్ధతపై ఆయన సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.