విద్యార్థుల కోసం పాటపాడి అలరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రిపోర్టర్: విజయ్ స్థలం: నెల్లూరు

నెల్లూరులో జరిగిన జెన్-జీ విద్యార్థుల ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థిని అభ్యర్థన మేరకు వేదికపై గళమెత్తిన ఆయన, జానపద పాటతో పాటు భావోద్వేగ భరితమైన పాటను మధురంగా ఆలపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆయన గాత్రాన్ని ప్రశంసిస్తున్నారు.