మహిళలపై నేరాల కట్టడికి ఏపీ పోలీసుల ప్రత్యేక చర్యలు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి భయం కలిగించేలా గత రెండేళ్లలో 3,207 సెక్సువల్ అఫెండర్ షీట్లను తెరిచినట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన సదస్సులో ఆమె ప్రజంటేషన్ ఇస్తూ, వేగంగా దర్యాప్తు చేపట్టి 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళలపై నేరాల రేటు 12.5 శాతం తగ్గిందని, దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.