ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సిద్ధిపేట
సిద్ధిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముట్టడిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దామరకుంట వద్ద ఇరువర్గాలు ముఖాముఖి ఎదురుపడటంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించి, ఆందోళనకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.