ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి వైద్య సేలు

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటివరకు 60 కోట్ల మందికి పైగా ఈ పథకం కింద కవరేజ్ లభించగా, 38 వేలకు పైగా ఆసుపత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. అలాగే 1.86 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు అందుబాటులోకి వచ్చాయి. స్వరాష్ట్రం కాకుండా ఇతర ప్రాంతాలలో 30 లక్షల మంది లబ్ధిదారులు వైద్యం పొందగా, మొత్తం 13 కోట్ల ఆసుపత్రి అడ్మిషన్లు నమోదయ్యాయి.