గుంటూరు-చీరాల రహదారిపై వంతెన కూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం

రిపోర్టర్: హరి స్థలం: గుంటూరు

గుంటూరు-చీరాల ప్రధాన రహదారిపై చేబ్రోలు-మంచాల మధ్య 130 ఏళ్ల నాటి వంతెన పాక్షికంగా కూలింది. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక, మట్టి లారీలు తిరగడమే ప్రమాదానికి కారణమని తేలింది. వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.