రాజశేఖర్ మరణానికి పోలీసుల ఒత్తిడే కారణమంటూ అంబటి రాంబాబు మండిపట్లు
రిపోర్టర్: రాము
స్థలం: పల్నాడు
పల్నాడు ప్రాంతంలో జరిగిన కాకుమాను రాజశేఖర్ మరణంపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజశేఖర్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఆయన ప్రభుత్వ తీరును తీవ్రంగా నిలదీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తూ, నిబంధనల ప్రకారమే విధుూ నిర్వర్తించామని స్పష్టం చేశారు. ఈ అంశంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.