వైద్యం అందక అల్లాటకం: దారకొండ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక తీవ్ర అవస్థలు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జీ.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ పదేళ్లుగా మరమ్మతులకు గురై అందుబాటులో లేకపోవడంతో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గిరిజన సమాఖ్య నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నూతన అంబులెన్స్ కేటాయించాలని అధికారులను డిమాండ్ చేశారు.