దసరా వేళ పాలపిట్టల బంధనంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను బంధించి వ్యాపారం చేయడంపై హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పక్షులను హింసించడం శిక్షార్హమైన నేరమని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా పాలపిట్టలను బంధిస్తే టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.