తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేగవరంలో ముందస్తు పారిశుద్ధ్య చర్యలు

రిపోర్టర్: fast news స్థలం: జంగారెడ్డిగూడెం

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని వేగవరం గ్రామంలో ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పంచాయతీ అధికారి దాసరి రాంబాబు ఆధ్వర్యంలో గ్రామంలోని వీధులు, ప్రధాన కూడళ్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కుక్కల మాధవరావు, అనిశెట్టి శ్రీనివాస్, బల్లె సత్యనారాయణ, కుక్కల సూరిబాబు, షేక్ పేంటు సాహెబ్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.