సీబీఎస్ఈ 2027 పరీక్షల ఎల్ఓసీ దరఖాస్తు తేదీలు వెల్లడి
రిపోర్టర్: రాము
స్థలం: India
కేంద్ర విద్యా మండలి సీబీఎస్ఈ 2027 బోర్డు పరీక్షల ఎల్ఓసీ సమర్పణ తేదీలను ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పదో తరగతి మొదటి విడత పరీక్షలతో పాటు ఇంటర్ విద్యార్థుల కోసం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు పూర్తి వివరాలతో సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.