పదవీకాలం ముగింపులో కన్నీటి పర్యంతమైన ఎంపీపీ రేఖ హరిశ్చంద్ర రెడ్డి
రిపోర్టర్: Balaji
స్థలం: పిచ్చాటూరు
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశం భావోద్వేగ వేదికగా మారింది. ఎంపీపీ రేఖ హరిశ్చంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత ఐదేళ్ల రాజకీయ ప్రయాణంపై పలువురు ఆత్మీయ అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. పదవీకాలం ముగిసే వేళ ప్రజలకు అందించిన సేవలను తలచుకుంటూ ఎంపీపీ కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని ఆమె సేవలను ప్రశంసించారు.