దారుణం: చెట్టుకు కట్టేసి ప్రియుడిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు
రిపోర్టర్: విజయ్
స్థలం: Mehsana
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో ప్రియురాలి కుటుంబ సభ్యులు యువకుడిని చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. సిద్ధ్‌పూర్ తాలూకా వాఘరోల్ గ్రామానికి చెందిన రంజిత్జీ ఠాకోర్ అనే ముప్పై ఒక్క సంవత్సరాల క్రెడిట్ మేనేజర్, తాంగ్నా గ్రామంలోని తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లగా ఆమె కుటుంబసభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.