పాముల భయంతో వణుకుతున్న నర్సంపేట అగ్నిమాపక కేంద్రానికి పక్కా భవనం కల్పించాలి

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని అగ్నిమాపక కేంద్రానికి పక్కా భవనం నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కనీస వసతులు, మరుగుదొడ్లు లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం చుట్టూ విషసర్పాలు సంచరిస్తుండటంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. వర్షం కురిస్తే కార్యాలయ పరిసరాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడే సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.