తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగింపు: చైర్మన్ రేసులో తీవ్ర పోటీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుమల

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనుందని రాజకీయ పరిశీలకులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల కొత్త బోర్డు నియామకంపై అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొన్నారు. పరిపాలనలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చైర్మన్ పదవి కోసం టీడీపీ సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, కిమిడి కళావెంకట్రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు వెల్లడించారు.