తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 15న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలను సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన శ్రీవేంకటేశ్వర స్వామివారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా టీటీడీ అధికారులు భారీ భద్రత, ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.