తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ మరియు బ్రహ్మోత్సవ వాహన సేవలు
రిపోర్టర్: గోపి
స్థలం: Tirupati
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ గా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. శనివారం ఒక్కరోజే 83,589 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.