హైదరాబాద్‌లో జలమండలి కొరడా: తాగునీరు వృథా చేసిన పబ్‌పై భారీ ఫైన్
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తాగునీటిని వృథా చేసిన ఫోర్ ఫాదర్స్ పబ్‌పై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటి దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పబ్‌కు ఇరవై వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు తాగునీటి కనెక్షన్‌ను పూర్తిగా తొలగించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని జలమండలి స్పష్టం చేసింది.