ఏపీలో లోక్ అదాలాత్‌కు భారీ స్పందన, లక్షలాది కేసులు పరిష్కారం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2,22,770 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.212.49 కోట్లకు పైగా పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీచేశారు. గుంటూరు జిల్లా సివిల్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో నిలిచింది. గురజాలలో 43 ఏళ్లనాటి భూసేకరణ వివాదం కూడా పరిష్కారమైంది.