ఊట్కూర్ లో ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభం: ఈఈ గోపాలచారి వెల్లడి

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఊట్కూర్

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రధాన చెరువుకు నీటిని తరలించే ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులను ఈఈ గోపాలచారి మంగళవారం ప్రారంభించారు. ప్రెజర్ పైపుల నుంచి చెరువు వరకు రెండు కిలోమీటర్లకు పైగా కాలువ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులను మూడు నుంచి నాలుగు నెలల్ లో పూర్తి చేయనున్నట్లు ఈఈ గోపాలచారి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు యాభై తొమ్మిది ఎకరాల భూమిని సేకరించినట్లు ఆయన వివరించారు.