మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి పరీక్షలు రాయకుండా, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఎస్జీటీ ఉద్యోగాలు కేటాయించారని మండిపడ్డారు. ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని, విజేతల జాబితాలో లేని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.