గణపవరం గడ్డపై ఘన విజయం: ఇరవై ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది

రిపోర్టర్: గోపి స్థలం: ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా గణపవరం గ్రామంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అఖండ విజయం సాధించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు వెల్లడించాయి. సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ప్రాంతంలో సైకిల్ పార్టీ జెండా ఎగరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యర్థి పార్టీల పట్టు ఉన్న ఈ గ్రామం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ సొంతూరు కావడం విశేషం.