సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్రని సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ

రిపోర్టర్: విజయ్ స్థలం: కరీంనగర్

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో ఉద్యోగులదే కీలక పాత్రని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయం కోసం వచ్చే వారిని కుటుంబ సభ్యుల్లా చూడాలని సూచించారు. ఉద్యోగుల పనితీరు వల్లే ప్రభుత్వానికి మంచి లేదా చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.