ఏపీయూడబ్ల్యూజే మీడియా కమిటీ కన్వీనర్గా లింగాల నరసింగరావు నియామకం

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మీడియా కమిటీ కన్వీనర్గా లింగాల నరసింగరావు నియమితులయ్యారు. నగరంలోని వీఆర్ గ్రాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.ఎస్.ఎస్.వి. ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఆరిపాక రాము, ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు ఆయనను ఘనంగా సత్కరించారు. మీడియా రంగంలో సమన్వయంతో పనిచేస్తూ, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి మీడియా కమిటీ చురుగ్గా కృషి చేయాలని ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆకాంక్షించారు.