కల్వకుర్తిలో నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ భీమ్ కుమార్

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంలోని కేశవనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ ప్రారంభించారు. దొంగతనాల నివారణ మరియు ప్రజల భద్రత కోసం స్థానిక కాలనీవాసుల సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, మహిళలకు రక్షణ కలుగుతుందని సీఐ స్పష్టం చేశారు.