రీసర్వే పనుల్ లో పొరపాట్లకు తావులేద్దు: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా
రిపోర్టర్: విజయ్
స్థలం: అలంపూర్
మానవపాడు మండలం జల్లాపురంలో జరుగుతున్న రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ తగాదాలకు చెక్ పెడుతూ పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సరిహద్దులను నిష్పక్షపాతంగా నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గిందని, కేవలం తాగునీటికే కేటాయిస్తున్నందున కాలువల ద్వారా సాగునీరు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.