కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్ర ఏర్పాటుకు ముందడుగు

రిపోర్టర్: రాము స్థలం: కాకినాడ

కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎంపీ సానా సతీష్‌కు లేఖ రాశారు. కేంద్రం ఏర్పాటుకు అనువైన భూమిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే మత్స్యకారులకు సముద్ర సమాచార సేవలు, చేపల వేట ప్రాంతాల వివరాలు సులభంగా అందుతాయి. మత్స్యకారుల జీవనోపాధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఎంపీ తెలిపారు.