రాజస్థాన్ లో దారుణం: ఆవు విక్రయానికి భార్య నిరాకరించిందని పికప్ ట్రక్కుతో తొక్కిచంపిన భర్త
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Sikar
రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో అప్పులు తీర్చేందుకు ఆవును విక్రయించాలనుకున్న భర్త నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించడంతో ఘోరం జరిగింది. ఈ వివాదంతో ఆగ్రహించిన చున్నిలాల్ కుమావత్ అనే వ్యక్తి తన భార్య చుంకీ దేవి పైకి పికప్ ట్రక్కును పోనిచ్చి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ హెచ్ ఓ రాకేష్ కుమార్ మీనా వెల్లడించారు.