తీరానికి మురసు తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: హరి స్థలం: బాపట్ల

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారుతోందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మురసు తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.