లక్నో రైల్వే స్టేషన్ లో దారుణం: ఏసీ కోచ్ లో భారీ చోరీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: లక్నో

లక్నో చార్బాగ్ రైల్వే స్టేషన్ లో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ దంపతుల ఏసీ కూపే లాక్ను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తి సుమారు ఎనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే హెల్ప్లైన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, అలారం చైన్ లాగినా జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించలేదని, గోండా స్టేషన్ వరకు రక్షణ లభించలేదని బాధితుడు ఉమేశ్ కుమార్ తీవ్రంగా వాపోయారు.