బంగ్లాదేశ్ రాజధానిలో షేక్ ముజిబుర్ శిల్పాల తొలగింపు ప్రతిపాదన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢాకా

బంగ్లాదేశ్లో తారీఖ్ రెహమాన్ ప్రభుత్వం సుహ్రావర్ది ఉద్యానవనంలో షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక ప్రసంగం, పాక్ సైనిక లొంగుబాటు శిల్పాలను తొలగించి వాటి స్థానంలో వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు విముక్తి యుద్ధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. రామనా రేస్ కోర్స్గా పిలిచే ఈ ప్రాంతంలో 2018 నుంచి కొనసాగుతున్న స్వాతంత్ర్య స్మారక ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఈ మార్పులు చేయాలని నిర్ణయించారు. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులు నిలిచిపోయాయి.