బస్సులో చిల్లర వివాదం: తోసేయడంతో కండక్టర్ మృతి చెందడంతో కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: Bhadradri Kothagudem

మనుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక చిల్లర వివాదంలో ప్రయాణికురాలు తోసేయడంతో తీవ్ర గాయాలపాలై మంగళవారం రాత్రి మృతి చెందారని అధికారులు తెలిపారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద అక్టోబర్ 25న జరిగిన ఈ ఘటనలో ప్రవళికపై బస్సు నుంచి తోసివేయడంతో వెనుక చక్రాలు కాళ్లపైకి ఎక్కాయి. పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోవడంతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించి ప్రభుత్వ సాయం ప్రకటించారు.