రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఏఐ నిపుణుల తయారీకి నిర్ణయం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఐదు లక్షల మంది కృత్రిమ మేధ నిపుణులను తయారు చేయాలని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో నిర్ణయించారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు అధ్యక్షతన శుక్రవారం అమరావతిలో ఈ సమావేశం నిర్వహించారు. కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీలో భాగంగా మౌలిక సదుపాయాలు, ప్రవేశాల ఆధారంగా పాయింట్లు కేటాయించాలని వీసీలకు స్పష్టం చేశారు. అలాగే అధ్యాపకులకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, విద్యా ప్రణాళికలో కృత్రిమ మేధను భాగం చేయడంపై చర్చించారు.