కావలిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం: ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహణ

రిపోర్టర్: సురేష్ స్థలం: కావలి

పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత సైతం ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని డీఎస్పీ వీవీ రమణ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.