సేవా సంకల్ప్ అభియాన్లో విద్యార్థుల సృజనాత్మక ప్రతిభ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేటలోని లక్నెపెల్లి శివాని హైస్కూల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. బీజేపీ నర్సంపేట రూరల్ అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.