మణుగూరులో సింగరేణి పాఠశాల బస్సుల నిర్లక్ష్యం: తీవ్ర ఆగ్రహంలో తల్లిదండ్రులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: మణుగూరు
మణుగూరు మండలంలో సింగరేణి పాఠశాల బస్సులు సమయపాలన పాటించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, దీనికి తోడు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యాజమాన్యం స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.