శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అత్యవసర భద్రతపై ఆక్టోపస్ బలగాల భారీ మాక్ డ్రిల్!

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల రక్షణే ధ్యేయంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఆక్టోపస్ బలగాలు గురువారం భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాద దాడి లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించడంపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు. టిటిడి ఈఓ రవిచంద్ర, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీ బి. కృష్ణ, విజిలెన్స్ అధికారులు, ఫైర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.