పంతంగి గణేశుడి లడ్డూ వేలంలో కైవసం చేసుకున్న చంద్రశేఖర్ రెడ్డి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. శోభాయాత్ర అనంతరం నిర్వహించిన లడ్డు మహాప్రసాదం వేలం పాటలో భాజపా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి రూ.99,116లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.