తిరుమల నడక మార్గంలో కలకలం సృష్టించిన చిరుత మరియు ఎలుగుబంటి సంచారం
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుమల
తిరుమలలో అటవీ జంతువులు భయపెట్టాయి. అలిపిరి నడకమార్గంలోని ఏడో మైలు వద్ద భక్తులకు చిరుత కనిపించగా, పాపవినాశనం రోడ్డులోని పారువేట మండపం సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత కోసం మూడు షిప్టుల్లో అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారి మధుసూదన్‌రావు వెల్లడించారు.