గరివిడి లక్ష్మి బయోపిక్ సక్సెస్ మీట్: తెరపై నా జీవితం చూసి ఆనందపడ్డాను
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ఏపీకి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయని గరివిడి లక్ష్మి మాట్లాడుతూ తన జీవితాన్ని తెరపై చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందని సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రంలో ఆనంది టైటిల్ రోల్ పోషించగా, గౌరినాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు.