కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
రిపోర్టర్: రమేష్
స్థలం: కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగిన తీవ్ర విషాదకర ఘటనలో పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం తమ పొలానికి పనికి వెళ్లిన మృతులు, మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా వాతావరణం మారి వర్షం రావడంతో ఈ ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.